Liger: ప్రీ క్లైమాక్స్ కోసం అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేసిన పూరి

Vijay Deverakonda Liger Movie Fresh Update
x

Liger: ప్రీ క్లైమాక్స్ కోసం అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేసిన పూరి

Highlights

Liger: "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమా తో అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Liger: "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమా తో అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. బాక్సర్ పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో కి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"లైగర్" లో సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఒక స్టార్ సెలబ్రిటీ ఉండబోతున్నారట. ఆ సెలబ్రిటీ రాక సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం. అయితే ఆ సెలబ్రిటీ మరెవరో కాదు మైక్ టైసన్ అని ఇండస్ట్రీ వర్గాల విశ్లేషణ. మైక్ టైసన్ పాత్ర రాకతో కథ ఉన్నట్టుండి మలుపు తిరుగుతుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ మరియు మకరంద్ దేష్పాండే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories