సమంత మ్యాజిక్ పైనే ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు

Deverakonda Fans Praying for Samantha’s Magic!
x

సమంత మ్యాజిక్ పైనే ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు

Highlights

Vijay Devarakonda: ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ టైం ఏ మాత్రం బాగోటం లేదు.

Vijay Devarakonda: ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ టైం ఏ మాత్రం బాగోటం లేదు. గతంలో "గీతగోవిందం", "అర్జున్ రెడ్డి" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోయిన యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. "నోటా", "డియర్ కామ్రేడ్", వంటి సినిమాలతోనే డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ సినిమా కచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు కూడా ఆశించారు. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడింది. దీంతో విజయ్ దేవరకొండ కరియర్లో మరొక మర్చిపోలేని డిజాస్టర్ ఎదురయింది. ఈ నేపథ్యంలో అభిమానులు తమ ఆశలన్నీ విజయ్ దేవరకొండ తదుపరి సినిమా పైన పెట్టుకున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్వాణ దర్శకత్వంలో "ఖుషి" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సమంతా మ్యాజిక్ విజయ్ దేవరకొండ పైన పని చేయాలని ఈ సినిమా అయిన విజయ్ దేవరకొండ కరియర్ ను గట్టెక్కించాలని అభిమానులు అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories