Vijay Deverakonda: యూట్యూబ్‌లో విజయ్ దేవరకొండ డ్రీం మూవీ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు.

Venkata Chari
Published on: 24 March 2021 5:30 PM IST
Vijay Deverakonda
X

విజయ్ దేవరకొండ (ఫొటో యూట్యూబ్)

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో.. విజయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో దక్షిణ భారతంలో అత్యధికంగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. అతని అపారమైన ప్రజాదరణే విజయ్ యొక్క మునుపటి చిత్రం ఇంటర్నెట్లో మిలియన్ల వీక్షణలను పొందడానికి సహాయపడింది.

ఇటీవల, విజయ్ లేటెస్ట్ రిలీజ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' డబ్ వెర్షన్ యూట్యూబ్‌లో విడుదలైంది. విడుదలైన రెండు నెలల వ్యవధిలో, ఈ సినిమా యూట్యూబ్ లో 105 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ, నార్తర్న్ బెల్ట్ ప్రేక్షకులు ఆదరించారు. కృతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ ట్రెసా, ఇజాబెల్లెలు మహిళా కథానాయికలుగా నటించారు.

ఈ జనాధరణే విజయ్ రాబోయే చిత్రం లైగర్ కు ఉత్తర భారతదేశం అంతటా మంచి ఓపెనింగ్స్ పొందేందుకు సహాయపడుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సెప్టెంబర్ 9 న పాన్-ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story