Vijay Deverakonda: కోటి మంది అభిమానులు.. హలో పవర్ లిస్టులో చోటు

Sandeep Reddy
Updated on: 20 July 2021 4:17 PM IST
Vijay Deverakonda Crossed 10 Million Followers in Facebook And Got Place in Hello Power List 2021 in Hello Magazine
X

విజయ్ దేవరకొండ ( ట్విట్టర్ ఫోటో)

Vijay Deverakonda: "పెళ్లి చూపులు" సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పరిచయమైన విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" సినిమాతో యూత్ ఐకాన్ హీరోగా క్రేజ్ సంపాదించి "గీత గోవిందం" చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు అతి త్వరలో "లైగర్" గా రాబోతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ ఖాతాలో కోటి మంది ఫాలోవర్స్ కి చేరడంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలకు అందని మరో అరుదైన ఘనతని సాధించాడు. ప్రముఖ మ్యాగాజిన్ "హలో" దేశవ్యాప్తంగా తాజాగా విడుదల చేసిన "హలో పవర్ లిస్టు 2021"లో విజయ్ దేవరకొండ స్థానం పొందాడు. టాలీవుడ్ నుండి ఈ పవర్ లిస్టు 2021లో విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు కూడా చోటు దక్కించుకున్నాడు.

Hello Power List 2021

ప్రతి ఏడాది డేరింగ్, టాలెంటెడ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో చోటు దక్కుతుంది. ఇక విజయ్ దేవరకొండకి తన చిన్ననాటి నుండి అభిమానించే హీరో మహేష్ బాబుతో ఈ పవర్ లిస్టులో చోటు దక్కించుకోవడంతో అటు దేవరకొండ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ని పొగుడుతూ తనలాంటి హీరోని గత 20 ఏళ్ళలో చూడలేదు అనడం, తాజాగా ఫేస్ బుక్ లో కోటి మంది ఫాలోవర్స్ ని సంపాదించడం, ఇప్పుడు పవర్ లిస్టులో చోటు దక్కడంతో విజయ్ దేవరకొండ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న "లైగర్" చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పవర్ లిస్టు 2021 లో విరాట్ కోహ్లి, ప్రియాంక చోప్రా, కత్రిన కైఫ్, కరణ్ జోహార్ తదితరులు ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story