'లైగర్'కి సీక్వెల్.. అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda Confirms A Sequel Of Liger Movie
x

'లైగర్'కి సీక్వెల్.. అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ..

Highlights

Vijay Deverakonda: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు.

Vijay Deverakonda: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 25న తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్, కన్నడ, మరియు మలయాళం భాషలలో కూడా విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమాకి సీక్వెల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"లైగర్" సినిమా గురించి మాట్లాడుతూ హిందీలో కూడా సినిమా విడుదల కావడానికి కరణ్ జోహార్ కారణమని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. మీడియా తో మాట్లాడుతూ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుందని కానీ ఇప్పుడే దాని గురించి మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కలిసి "జనగణమన" అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత "లైగర్" కి సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories