Vijay Deverakonda: కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి..

Vijay Deverakonda: కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి..
x

Vijay Deverakonda: కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి..

Highlights

Virosh: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Virosh: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం (మార్చి 4) సాయంత్రం వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగనున్న నేపథ్యంలో, ఈ జంట మంగళవారం తెలుగు మీడియా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

కొత్త కోడలిని దీవించండి..

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సరదాగా మాట్లాడుతూ.. "తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు (రష్మిక) వచ్చింది. తనను మంచిగా చూసుకోండి" అంటూ నవ్వులు పూయించారు. తమ ఎదుగుదలలో మీడియా కూడా ఒక భాగమని, పెళ్లి చేసుకుని జంటగా రావడం ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు. "కాలం గడిచిపోతోంది, మనం పెద్దవాళ్లం అవుతున్నాం. కానీ మా హృదయాల్లో మీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ ఆశీస్సులు మాకు కావాలి" అని విజయ్ కోరారు.

కొత్త అధ్యాయం మొదలైంది: రష్మిక

రష్మిక మందన్న మాట్లాడుతూ.. తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టామని, ఈ ప్రయాణంలో అందరి మద్దతు ఉండాలని కోరారు. ఇప్పటికే ఈ జంట మార్చి 1న పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ, ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో అభిమానులకు ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు.

నేడే గ్రాండ్ రిసెప్షన్..

ఈరోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. భారీ ఎత్తున విచ్చేసే అతిథుల కోసం నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories