Project K: "ప్రాజెక్ట్ కె" లో నటించబోతున్న విజయ్ దేవరకొండ, నాని..!!

Sandeep Reddy
Published on: 6 Aug 2021 12:54 PM IST
Vijay Deverakonda And Nani Acting Key Role in Nag Ashwin Prabhas Project K Movie
X

"ప్రాజెక్ట్ కె" లో నటించబోతున్న విజయ్ దేవరకొండ, నాని

Project K Movie Update: నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "ప్రాజెక్ట్ కే" లో ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తో పాటు హీరోయిన్ దీపిక పదుకునే కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో రెండు పాత్రలకు నాగ్ అశ్విన్ టాలీవుడ్ స్టార్ హీరోలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, నానిలను ఈ సినిమాలోని ఒక కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మిషన్ ఇంపాసిబుల్, ఎవెంజర్స్ వంటి చిత్రాలకు వాడిన అలెక్సా కెమెరాని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు చిత్ర యూనిట్.

సుమారుగా 100 రోజుల కెమెరా రెంట్ కే 7 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ తాజాగా ఈ ఇద్దరు యంగ్ హీరోలను "ప్రాజెక్ట్ కే" లోకి ఎంపిక చేయడంతో అటు బాలీవుడ్ లో బిగ్ బి తో పాటు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, నానిలతో సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పటికే "రాధేశ్యామ్" షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు సలార్, అదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి వరుస సినిమాల షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక "మహానటి" సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ తాజాగా "ప్రాజెక్ట్ కే" వంటి పాన్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story