Liger Movie Collections: మిక్స్డ్‌ టాక్‌తో దుమ్ము రేపిన లైగర్.. మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..!

Liger Movie Collections: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' చిత్రం ఆగష్టు 25వ తేదీన విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 26 Aug 2022 3:13 PM IST
Vijay Devarakondas Liger Movie Day 1 World Wide Collections
X

Liger Movie Collections: మిక్స్డ్‌ టాక్‌తో దుమ్ము రేపిన లైగర్.. మొదటి రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..!

Liger Movie Collections: యువ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' చిత్రం ఆగష్టు 25వ తేదీన విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ మంది ఈ సినిమా బాగాలేదని అంటుంటే కొంతమంది మాత్రం బాగానే ఉందంటున్నారు. అయితే ఇలాంటి టాక్ నేపథ్యంలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.33.12 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. బ్లాక్‌బస్టర్‌ లైగర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ని జత చేస్తూ ట్వీట్‌ చేసింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story