'హీరో' గా మారనున్న విజయ్ దేవరకొండ

Ruthvik
Published on: 13 March 2019 12:14 PM IST
హీరో గా మారనున్న విజయ్ దేవరకొండ
X

ఈ మధ్యనే 'టాక్సీవాలా' సినిమాతో హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరొక సినిమా లో లైన్ లో పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై విజయ్ దేవరకొండ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సినిమా తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా మా తొమ్మిదవ ప్రొడక్షన్ ను ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్న ఈ సినిమా అన్ని సౌత్ ఇండియా భాషల్లోనూ విడుదల కానుంది. 'హీరో' అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 22 నుండి న్యూఢిల్లీ లో మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం." అని మైత్రి వారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ నటించిన 'నోట' సినిమా మాత్రమే తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కానీ ఇప్పుడు ఈ సినిమా అన్ని సౌత్ ఇండియా భాషల్లో విడుదల కావడం విశేషం.

Ruthvik

Ruthvik

Next Story