విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి దిగనున్న తన తండ్రి

Vijay Devarakonda’s Father Begins His Hunt
x

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి దిగనున్న తన తండ్రి

Highlights

మళ్లీ తన తండ్రి పై ఆధారపడనున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: "అర్జున్ రెడ్డి" సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ నాన్నగారు గోవర్ధన్ చాలావరకు విజయ్ దేవరకొండ కి వచ్చిన కథలను వినే వారట. అందులో తనకి బాగా నచ్చిన కథను మాత్రమే ఎంపిక చేసి విజయ్ దేవరకొండ వద్దకు పంపించేవారట. అలానే "పెళ్లి చూపులు" వంటి సూపర్ హిట్ సినిమా కూడా విజయ్ దేవరకొండకు దొరికింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మళ్లీ తన నిర్ణయాల మీద నిలబడటం అలవాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ తన నాన్నగారి సహాయం పొందబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గోవర్ధన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ స్క్రిప్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండ వరుసగా "డియర్ కామ్రేడ్", "వల్డ్ ఫేమస్ లవర్", "లైగర్" వంటి సినిమాలు తో వరుస డిజాస్టర్లను అందుకున్నారు.

ప్రస్తుతం సమంత హీరోయిన్గా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న "ఖుషి" సినిమా తప్ప విజయ్ దేవరకొండ చేతిలో మరొక సినిమా లేదు. మరోవైపు ఇంద్రగంటి మోహన కృష్ణ, హరీష్ శంకర్ వంటి డైరెక్టర్లు విజయ్ దేవరకొండ కి కథ నేరెట్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ ఈ కథలను విని అందులో ఫైనల్ కాల్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారైనా విజయ్ దేవరకొండ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories