Vijay Devarakonda: హవాయి చెప్పులు వేసుకుని షాక్ ఇచ్చిన యువ హీరో

Vijay Devarakonda: తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ బాగా ఫాలో అయ్యే యువ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.

Arun Chilukuri
Published on: 23 July 2022 1:21 PM IST
Vijay Devarakonda With Sandals Worth Rs 199
X

Vijay Devarakonda: హవాయి చెప్పులు వేసుకుని షాక్ ఇచ్చిన యువ హీరో

Vijay Devarakonda: తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ బాగా ఫాలో అయ్యే యువ హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ఏం వేసుకున్నా దాంతోనే ట్రెండ్ సృష్టించే హీరో విజయ్ దేవరకొండ. తన సినిమాలతో మాత్రమే కాక ఫ్యాషన్ సెన్స్ తో కూడా ప్రేక్షకులను దృష్టిని ఆకర్షిస్తాడు విజయ్. సెలబ్రిటీలందరూ ఫ్యాషన్ పేరుతో పెద్దపెద్ద బ్రాండెడ్ బట్టలు వేసుకొని కెమెరా ముందు కనిపిస్తూ ఉంటారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం అందరికంటే విభిన్నంగా చాలా తక్కువ ధర ఉన్న బట్టలు వేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం తన తదుపరి సినిమా "లైగర్" ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కేవలం 500 మాత్రమే విలువ చేసే ఒక టీ షర్ట్ మరియు చాలా నార్మల్ కార్గో పాంట్ వేసుకొని వచ్చారు. అన్నిటికంటే హై లైట్ విజయ్ దేవరకొండ వేసుకున్న హవాయి చెప్పులు. కేవలం 199 రూపాయలు విలువ చేసే ఆ చెప్పులను "ఫ్లిప్ ఫ్లాప్స్" అని కూడా పిలుస్తారు.

ఒకవైపు విజయ్ దేవరకొండ నటిస్తున్న "లైగర్" సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు గడిస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరోవైపు విజయ్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్స్ కి ఇలాంటి లుక్ తో కనిపించడం కొందరికి షాకింగ్ గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్లమ్స్ లో పెరిగిన ఒక వ్యక్తి పాత్రలో నటించనున్నారు. అందుకే తన పాత్ర ను రిప్రజెంట్ చేయడానికి విజయ్ దేవరకొండ అలాంటి లుక్ లో కనిపించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story