పూరి సినిమా ని పక్కన పెట్టిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో "లైగర్" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 8 March 2022 4:42 PM IST
Vijay Devarakonda who put Aside Puri Cinema
X

పూరి సినిమా ని పక్కన పెట్టిన విజయ్ దేవరకొండ 

Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో "లైగర్" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లోనే "జనగణమన" అని ఒక సినిమాని చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టుని పక్కకుపెట్టి శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా సాగనుందట. నిజానికి పూరి జగన్నాథ్ "జనగణమన" షూటింగ్ అమెరికాలో చేయాలని అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వక ప్రస్తుతం పూరి మరియు చిత్రబృందం ఆస్ట్రేలియాలోని కొన్ని లొకేషన్లు వెతికే పనిలో పడింది. లొకేషన్లు, పర్మిషన్లు, విసా పనులు అన్నీ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుందని ఈ లోపు శివ నిర్వాణ సినిమా పూర్తి చేసేయచ్చు అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పూరి తో చర్చించాక పూరి జగన్నాథ్ కూడా ఒప్పుకోవడం తో విజయ్ దేవరకొండ ఇప్పుడు శివ నిర్వాణ సినిమాని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story