విజయ్ దేవరకొండ నటించాల్సిన సినిమా లో కళ్యాణ్ రామ్..

* విజయ్ దేవరకొండ కి అనుకున్న స్క్రిప్ట్ నందమూరి హీరో చేతుల్లోకి వెళ్లిందా?

Dhatripriya
Published on: 7 Feb 2023 12:52 PM IST
Kalyan Ram In Vijay Deverakonda Film
X

విజయ్ దేవరకొండ నటించాల్సిన సినిమా లో కళ్యాణ్ రామ్.. 

Nandamuri Kalyan Ram: కొన్ని కొన్ని సార్లు తమ వద్దకు వచ్చిన ప్రాజెక్టులను వద్దనుకొని ఇష్టపడి చేసిన ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతూ ఉంటాయి. కానీ వద్దనుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో లేదా హీరోయిన్ కి కొంత బాధ కలుగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ సినిమా విజయ్ దేవరకొండ కి వచ్చిందట కానీ విజయ్ దేవరకొండ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకి నో చెప్పినట్లు తెలుస్తోంది ఆ తరువాతే ఈ సినిమా కథ కళ్యాణ్ రామ్ చేతుల్లోకి వెళ్ళింది.

వివరాల్లోకి వెళితే వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్తున్న విజయ్ దేవరకొండ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారితో ఒక సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు విజయ్ దేవరకొండ కి ముందుగా "అమీగోస్" కథని వినిపించారట. కానీ విజయ్ దేవరకొండ కి మాత్రం "డియర్ కామ్రేడ్" కథ బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాకి నో చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ చెప్పినట్లే మైత్రి మూవీ మేకర్స్ వారు "డియర్ కామ్రేడ్" సినిమాని నిర్మించి 2019లో విడుదల చేశారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక "అమిగోస్" సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ఒక ఫ్లాప్ సినిమా కోసం విజయ్ దేవరకొండ హిట్ సినిమా ని వదులుకున్నట్లే అవుతుంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

Dhatripriya

Dhatripriya

Next Story