Devarakonda - Sukumar Movie: విజయ్-సుకుమార్ కాంబో మూవీపై క్లారిటీ

Confirmation About Vijay Devarakonda Sukumar Combo Movie | Vijay Devarakonda New Movie
x

సుకుమార్- విజయ్ దేవరకొండ (ఫొటో ట్విట్టర్)

Highlights

Vijay Devarakonda - Sukumar Movie: సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబో లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Vijay Devarakonda - Sukumar Movie: సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఈ మూవీపై ఎటుంవంటి అప్‌డేట్ లేదు. దీంతో కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఈ సినిమా ఆగిపోయిందని కొందరు, లేదు వాయిదా పడిందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఫాల్కన్ క్రియోషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. వీరి కాంబోలో మూవీ ఆగిపోలేదని, ఖచ్చితంగా అనుకున్న టైం మేరకు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్నారు. ఈ సినిమాను ఈ సంస్థే నిర్మిస్తోంది. దీంతో సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మూవీపై క్లారిటి వచ్చింది.

కాగా, ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా 'పుష్ప' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే పుష్ప టీజర్ విడుదలైంది. టీజర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

ఇక, విజయ్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాతో బిజీగా మారాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్, విజయ్ దేవరకొండ కమిట్మెంట్స్ అయిన వెంటనే వీరి కాంబోలో చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories