బైక్ రేసర్ గా మారనున్న 'టాక్సీవాలా'

బైక్ రేసర్ గా మారనున్న టాక్సీవాలా
x
Highlights

ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాలో సర్జన్ గా, 'గీత...

ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాలో సర్జన్ గా, 'గీత గోవిందం' సినిమా లో ప్రొఫెసర్ గా, ఈ మధ్యనే విడుదలైన 'టాక్సీవాలా' సినిమాలో టాక్సీ డ్రైవర్ గా కనిపించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి సినిమాలో బైక్ రేసర్ అవతారం ఎత్తనున్నాడు. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తవ్వలేదు కానీ అప్పుడే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా లైన్లో పెట్టాడు.

తమిళ రచయిత ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఒక తెలుగు-తమిళ భాషల్లో విడుదలయ్యే ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పాడు విజయ్ దేవరకొండ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బైక్ రేసర్ గా కనిపించనున్నాడని, ఈ సినిమా కోసం ఇప్పటికే బైక్ రేసింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు విజయ్. చెన్నైలోని రేసింగ్ ట్రాక్ మీద రేస్ బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు ఈ 'పెళ్లిచూపులు' హీరో. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మొదటి షెడ్యూల్ లోనే విజయ్ దేవరకొండ ఒక బైక్ రేసింగ్ ఎపిసోడ్ లో నటించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories