బాయ్‌కాట్‌ లైగర్ పై రియాక్ట్ అయిన విజయ్.. దిమ్మతిరిగే రిప్లై..

Vijay Devarakonda Respond On Boycott Liger Issue
x

బాయ్ కాట్ లైగర్ పై రియాక్ట్ అయిన విజయ్.. దిమ్మతిరిగే రిప్లై..

Highlights

బాయ్‌కాట్‌ లైగర్ పై ఘాటుగా స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా లైగర్ పైన పెట్టుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 25వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నెటిజన్లు తాజాగా బాయ్‌కాట్‌ లైగర్ అంటూ ట్విట్టర్లో ఒక హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు.

"మా సినిమా కరోనాకి ముందు 2019లో మొదలైంది. అప్పటికి బాయ్ కాట్ బాలీవుడ్ లాంటివి లేవు. అవి మొదలయ్యే సరికి మేము మా షెడ్యూల్ కూడా మొదలుపెట్టేసాము. సినిమాని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లడానికి కరణ్ సర్ కంటే ఇంకొక ఆప్షన్ కనిపించలేదు. ఆయన బాహుబలిని ఇండియా మొత్తానికి తీసుకెళ్లారు. నార్త్ లో మనకి తెలియని ఒక కొత్త దారిని ఆయన మనకు చూపించారు. మన సినిమాని తీసుకుని వెళ్లి హిందీలో విడుదల చేయమని కోరగా ఆయన హృదయపూర్వకంగా మాకు స్వాగతం పలికారు. ఆయన వల్లే ఇప్పుడు మా సినిమాకి ఇంత రీచ్ వచ్చింది. నాకు వీళ్ళ గొడవ ఏమిటో అర్థం కావటం లేదు. నేను ఇండియాలోనే పుట్టాను. నేను హైదరాబాద్ లో పుట్టాను. చార్మి పంజాబ్ లో పుట్టింది. పూరి సార్ నర్సీపట్నంలో పుట్టారు. మేము మూడేళ్లు కష్టపడి సినిమా చేశాము. ఇప్పుడు మేము ఏ సిటీకి వెళ్ళినా మమ్మల్ని జనాలు అంతే ప్రేమిస్తున్నారు. ఆ జనాల కోసమే మేము సినిమాలు చేస్తున్నాము. మనవాళ్లు మనకి ఉన్నంత సేపు మనకి ఎలాంటి భయం లేదు," అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

''ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్‌ కాదు మేము. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే. లాక్‌డౌన్‌ సమయంలో నేను మొదలు పెట్టిన 'మిడిల్‌క్లాస్‌ ఫండ్‌' కోసం ఎంతో మంది విరాళం ఇచ్చారు. అలాంటి వాళ్లు మనకు కావాలి. ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు 'లైగర్‌' కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్‌ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్‌ చేస్తారా. ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదు'' అంటూ విజయ్‌ అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories