Vijay Devarakonda: స్టార్ డైరెక్టర్ ప్రతిపాదనను రిజక్ట్ చేసిన విజయ్ దేవరకొండ?

Vijay Devarakonda: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.

Venkata Chari
Published on: 26 April 2021 7:53 PM IST
Vijay Devarakonda Rejects Koratalas Proposal!
X

విజయ్ దేవరకొండ, కొరటాల శివ (ఫొటో ట్విట్టర్)

Vijay Devarakonda: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ స్టార్ తో కలిసి పనిచేయడానికి చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ 'లైగర్' తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీని తరువాత, విజయ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేయనున్నాడు.

ఇంతలో విజయ్ దేవరకొండ పై కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ ప్రతిపాదనను విజయ్ దేవరకొండ తిరస్కరించాడని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. యువ సుధ క్రియేషన్స్ బ్యానర్‌తో నిర్మాతలుగా మారిన తన స్నేహితులకు సహాయం చేయాలని కొరటాల శివ కోరుకున్నాడంట. వీరితో సినిమా చేయాలని విజయ్ ను కోరాడంట కొరటాల.

తాను ప్రస్తుతం బిజీగా ఉన్నానని, కొత్త ప్రాజెక్టుకు డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పి.. విజయ్ దేవరకొండ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విజయ్ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని కొరటాల ఊహించలేదంట. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story