Vijay Devarakonda - Rashmika: విజయ్ దేవరకొండ తో గోవా వెళ్లిన రష్మిక మందన్న

Vijay Devarakonda - Rashmika: వారు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి...

admin1
Updated on: 7 Jan 2022 3:14 PM IST
Vijay Devarakonda Rashmika Mandanna Goa Tour for New Year Celebrations | Tollywood News
X

Vijay Devarakonda - Rashmika: విజయ్ దేవరకొండ తో గోవా వెళ్లిన రష్మిక మందన్న

Vijay Devarakonda - Rashmika: "గీతగోవిందం" సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీ తో అందరి దృష్టిని ఆకర్షించిన జంట రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత "డియర్ కామ్రేడ్" సినిమా లో కలిసి నటించినప్పటికీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. కానీ ఇప్పటికీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా మంది అభిమానులు అనుకున్నారు.

వారు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి కానీ అందులో నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి తమ కుటుంబాలతో పాటు గోవా కి వెళ్లారు.దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరు పెట్టిన ఫోటోలు చూస్తే ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నట్లు, న్యూ ఇయర్ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1

admin1

Next Story