సన్ రైజర్స్ హైదరాబాద్ కి నాని ఆడాలట

సన్ రైజర్స్ హైదరాబాద్ కి నాని ఆడాలట
x
Highlights

జెర్సీ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మెల్లగా సినిమా హీరోలు ఒక్కొక్కరు సినిమా గురించి తమ అభిప్రాయం చెప్తూ వచ్చారు. తాజా గా విజయ్...

జెర్సీ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మెల్లగా సినిమా హీరోలు ఒక్కొక్కరు సినిమా గురించి తమ అభిప్రాయం చెప్తూ వచ్చారు. తాజా గా విజయ్ దేవరకొండ కూడా సినిమా చూసి తన అభిప్రాయాన్ని చెప్పాడు. "జెర్సీ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. సినిమా లో నాని పోషించిన అర్జున్ పాత్ర కి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను. నాని మీద ప్రేమ మరింత పెరిగింది.

దర్శకుడు గౌతమ్ ఈ సినిమా తో ఏం చెప్తాడా అని ముందు నుండి ఆసక్తి గా ఎదురు చూసాను. మొత్తానికి ఈ సినిమా తో తన పని తనం మంచిగా చూపించాడు." అని చెప్పిన విజయ్ చివరలో ఒక చురక కూడా పెట్టాడు. "నాని స్ట్రైకింగ్ చూసాక, నాకు తను సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది." అన్నాడు. విజయ్ సమీక్ష కె కాకుండా తాను చివరలో చేసిన కామెంట్ తో కూడా చాలా మంది నెటిజన్స్ ఏకీభవించారు. నాని లాంటి ఆటగాడు కచ్చితంగా క్రికెట్ ఆడుతూ ఉండాలి అని అందరూ అభిప్రాయం తెలిపారు. ఇక మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్న జెర్సీ నేడు ఎంత రాబడుతుందో అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories