రికార్డు సృష్టించబోతున్న విజయ్ దేవరకొండ, రాశి కన్నా ల ముద్దు

రికార్డు సృష్టించబోతున్న విజయ్ దేవరకొండ, రాశి కన్నా ల ముద్దు
x
Highlights

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలోని ఇమ్రాన్ హష్మీ గా మారిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి లాగా విజయ్...

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలోని ఇమ్రాన్ హష్మీ గా మారిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి లాగా విజయ్ దేవరకొండ కూడా దాదాపు అన్ని సినిమాల్లోనూ లిప్ లాకులను కామన్ పాయింట్ గా మార్చేశాడు. 'అర్జున్ రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలలో హీరోయిన్ లకు ముద్దు లు పెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం నిర్మిస్తున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. అంతేకాకుండా అందులో రాశి ఖన్నా కూడా ఒకరు. అయితే క్రాంతిమాధవ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు రాశి ల మధ్య ఒక లెంగ్తీ లిప్ లాక్ సీన్ ను పెట్టాలని అనుకుంటున్నాడట. సౌత్ లో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా రికార్డ్ క్రియేట్ చేసే లాగా ఈ ముద్దు సన్నివేశం ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ముద్దు సన్నివేశాలు అన్నీ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి రికార్డు బద్దలు కొట్టేలా అంటే ఈ సన్నివేశం ఎలా ఉండబోతోందో అనే విషయం పై ఇప్పటి నుండే చర్చలు మొదలు అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories