మజిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ

Ruthvik
Published on: 13 March 2019 11:52 AM IST
మజిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ
X

'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాలలో కలిసి నటించిన టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగ చైతన్య పెళ్లయిన తరువాత మొట్టమొదటిసారిగా నటిస్తున్న చిత్రం కావడంతో 'మజిలీ' సినిమా పైన చాలానే అంచనాలు ఉన్నాయి. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. దానికి కారణం అని శివ నిర్వాణ అని తెలుస్తోంది.

తాజాగా దర్శకుడు శివ నిర్వాణ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నారట. అంతేకాక విజయ్ ను కలిసి ఒక కథను కూడా వినిపించాడట. కథ బాగానే ఉండటంతో విజయ్ కూడా ఆసక్తి చూపుతున్నాడట. కానీ ఈ సినిమా విడుదల తరువాత ఏ విషయం చెబుతాడాని తెలుస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అయితే అప్పుడు సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పుకుంటాడని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సమంత జంటగా 'మహానటి' సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ త్వరలో 'డియర్ కామ్రేడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story