ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ...

Vijay Devarakonda: ఈ సినిమా కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ హీరోగా మరొక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే...

Shireesha
Updated on: 5 May 2022 6:00 PM IST
Vijay Devarakonda Going to Act with Prabhas Heroine Pooja Hegde | Tollywood Gossips
X

ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ...

Vijay Devarakonda: పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ఈమధ్య డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, సినిమాలతో డిజాస్టర్ లు చవిచూశాడు. ఇక తాజాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో "లైగర్" సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా మరొక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరో స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు పూజా హెగ్డే. అల వైకుంఠ పురం లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాల తో ముందుకు దూసుకుపోతున్న పూజా హెగ్డే కి "రాధేశ్యామ్" సినిమాతో బ్రేక్ లు పడ్డాయి.

ఇక ఈ మధ్యనే పూజా హెగ్డే ముఖ్యపాత్ర పోషించిన "ఆచార్య" కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే మరోవైపు పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో మహేష్ బాబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కూడా పూజా హెగ్డే సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నాయి.

Shireesha

Shireesha

Next Story