'డియర్ కామ్రేడ్' సినిమాకి విడుదల తేది ఖరారు

డియర్ కామ్రేడ్ సినిమాకి విడుదల తేది ఖరారు
x
Highlights

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస బ్లాక్ బస్టర్ లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఈ మధ్యనే 'టాక్సీవాలా' సినిమాతో హిట్ అందుకున్న విజయ్ త్వరలో 'డియర్...

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస బ్లాక్ బస్టర్ లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఈ మధ్యనే 'టాక్సీవాలా' సినిమాతో హిట్ అందుకున్న విజయ్ త్వరలో 'డియర్ కామ్రేడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'గీత గోవిందం' సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేసిన రష్మీక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. నిర్మాణాంతర పనులతో బిజీగా వుంది ఈ చిత్ర బృందం.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. 'డియర్ కామ్రేడ్' సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జులై 26న విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'గీత గోవిందం' సినిమాతోనే తమ కెమిస్ట్రీ తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్-రష్మీక ఈ సినిమాతో కూడా అంతే విజయాన్ని సాధిస్తారో లేదో చూడాలి. ఈ సినిమా పైన ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories