Vijay Devarakonda: భారీ అమౌంట్ కి అమ్ముడైన "లైగర్" ఓవర్సీస్ రైట్స్

Vijay Devarakonda: భారీ అమౌంట్ కి అమ్ముడైన "లైగర్" ఓవర్సీస్ రైట్స్

Sriveni Erugu
Updated on: 7 Aug 2022 12:49 PM IST
Vijay Devarakonda Craze is Shocking Even Overseas
X

Vijay Devarakonda: ఓవర్సీస్ లో కూడా షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ క్రేజ్

Vijay Devarakonda: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ కరియర్లో మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమాకి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ బిజినెస్ అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రికార్డ్ స్థాయికి అమ్ముడయ్యాయి.

కేవలం ఓవర్సీస్ రైట్స్ తోనే ఈ సినిమా ఎనిమిది కోట్లు గడించినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ నటించిన అన్ని సినిమాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద నంబర్. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న పూరి జగన్నాథ్ కరియర్ లో కూడా ఇంత భారీ మొత్తానికి సినిమా రైట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి. చూస్తూ ఉంటే సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు ఈ మధ్యనే విడుదలైన "బింబిసార" కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్నాయి. ఇక ఆగస్ట్ 25న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మలయాళం బాషల్లో కూడా ఈ సినిమా కూడా అదే స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంటుందని చెప్పవచ్చు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story