మళ్లీ ఆ హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

మళ్లీ ఆ హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న విజయ్ దేవరకొండ
x
Highlights

'నోటా' అనే సినిమాతో మొట్టమొదటి ద్విభాషా చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్రాంతిమాధవ్...

'నోటా' అనే సినిమాతో మొట్టమొదటి ద్విభాషా చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా తర్వాత మళ్లీ ఒక ద్విభాషా చిత్రం చేయనున్నాడు ఈ యువ హీరో. తమిళ రచయిత ఆనంద్ అన్నామలై ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు అని సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

'అర్జున్ రెడ్డి' సినిమాలోని హీరోయిన్ షాలిని పాండే ఈ సినిమాలో కూడా నటించబోతోందని కొందరు అంటున్నారు. 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ మరియు షాలిని పాండే రొమాన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. వారిద్దరి కెమిస్ట్రీ ఆ సినిమాలో బాగా పండింది. ఇక ఈ సినిమాలో కూడా అలానే అవుతుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే 'గీతగోవిందం' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న తో విజయ్ దేవరకొండ మళ్ళీ 'డియర్ కామ్రేడ్స్' సినిమాలో నటించాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కోసం హీరోయిన్ ను రిపీట్ చేయనున్నాడు ఈ యువ హీరో.

Show Full Article
Print Article
Next Story
More Stories