Jana Gana Mana: "జనగణమన" విషయంలో పూరి మరియు విజయ్ కీలక నిర్ణయం

Jana Gana Mana: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లైగర్".

Arun Chilukuri
Published on: 2 Sept 2022 4:12 PM IST
Vijay Devarakonda and Puri Decided not to Take Remuneration
X

Jana Gana Mana: "జనగణమన" విషయంలో పూరి మరియు విజయ్ కీలక నిర్ణయం

Jana Gana Mana: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లైగర్". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాల డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు వాటిల్లాయి. అయితే తాజాగా ఈ నష్టాలను భర్తీ చేసేందుకు విజయ్ దేవరకొండ మరియు పూరి పూనుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ త్వరలోనే కలిసి "జనగణమన" అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చాలా తక్కువ బడ్జెట్ ఉపయోగించి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేయాలని విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

నిజానికి "లైగర్" సినిమా తర్వాత "జనగణమన" సినిమాపై అంచనాలు చాలా తగ్గిపోయాయని చెప్పుకోవాలి. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో సాగానున్న ఈ సినిమా లో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. తన కెరియర్లో విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం మంచి కంటెంట్ ఉన్న కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story