Vijay Antony : 'విజయ రాఘవన్..విజయానికే నాయకన్' టీజ‌ర్ రిలీజ్‌

బిచ్చగాడు, భేతాళుడు వంటి వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని.

Samba Siva Rao
Published on: 2 Jan 2021 6:09 PM IST
Vijay Antony : విజయ రాఘవన్..విజయానికే నాయకన్ టీజ‌ర్ రిలీజ్‌
X

బిచ్చగాడు, భేతాళుడు వంటి వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. బిచ్చగాడు చిత్రం విజయంతో నటుడిగా, దర్శకుడిగా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యారు. విజయ్‌ ఆంటోని హీరోగా మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విజయ రాఘవన్‌'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తెలుగు, తమిళంతోపాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు.

ఇందులో విజయ్‌ ట్యూషన్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు.''ఎవ‌డ‌య్యా వాడు అని ఓ వాయిస్ అడిగిన‌ప్ర‌శ్న‌కు... పేరు విజ‌య రాఘ‌వ‌న్ అండి.. మా ఏరియా ట్యూష‌న్ మాస్ట‌ర్'' అని హీరో ఇంట్ర డ‌క్షన్‌తో టీజ‌ర్ మొద‌లైంది. 'విజయ రాఘవన్..విజయానికే నాయకన్' అనే సాంగ్ బ్యాగ్రౌండ్‌గా టీజర్ ఉంది. 'గాజు ముక్క కూడా వేస్టే.. కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుంది' అంటూ విజయ్‌ గురించి విలన్‌ చెబుతున్న మాస్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story