Vijay Antony: యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బిచ్చగాడు హీరో

Vijay Antony: విజయ్ ఆంటోని తాజాగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా 'అగ్ని సిరగుగల్' షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

Sandeep Eggoju
Published on: 26 May 2021 11:41 AM IST
Vijay Antony as Hero in Action Thriller Movie
X

హీరో విజయ్ ఆంటోనీ (ఫైల్ ఇమేజ్)

Vijay Antony: విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నవాడు. కాని ఆ సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయినా వరుస సినిమాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు విజయ్ ఆంటోని. కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైన విజయ్ ఆంటోని.. ఈసారి మాంచి యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అవుతాయా అని విజయ్ ఎదురు చూస్తున్నాడు.

విజయ్ ఆంటోని పేరు వినగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తుకు వస్తుంది. ఒక శ్రీమంతుడు తన తల్లి ప్రాణాలను నిలబెట్టడం కోసం 'బిచ్చగాడు'గా మారడమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలోని ఎమోషన్ ప్రేక్షకులకు ఒక రేంజ్ లో కనెక్ట్ కావడంతో, వసూళ్ల వర్షం కురిసేసింది. ఆ తరువాత విజయ్ ఆంటోని సినిమాలు వరుసగా తెలుగులో విడుదలయ్యాయి.

విజయ్ ఆంటోని గత చిత్రాల మాదిరిగానే, తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అరుణ్ విజయ్ ప్ర్రకాశ్ రాజ్ అక్షర హాసన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయట.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story