Vamshi Paidipally - Vijay: ఫస్ట్ నెరేషన్ తోనే విజయ్ ని మెప్పించిన వంశీ

* విజయ్ తో సినిమా నా డెస్టినీ అంటున్న స్టార్ డైరెక్టర్

admin1
Updated on: 2 Oct 2021 5:16 PM IST
Vijay Accepted to do movie with the Director Vamshi Paidipally
X

వంశీ పైడిపల్లి - విజయ్  (ఫైల్ ఫోటో)

Vamshi Paidipally - Vijay: ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "మహర్షి" సినిమాకి దర్శకత్వం వహించిన వంశీపైడిపల్లి ఇప్పుడు తమిళ్ సూపర్ స్టార్ అయిన దళపతి విజయ్ మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో సెట్స్ పైకి వెళ్లనుంది. వంశీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. సినిమా గురించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు చాలా సమయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

"ఏప్రిల్ అనౌన్స్ చేయాల్సింది, కరోనా తర్వాత ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా మంచి సమయంలో చేయాలని మా కోరిక. విజయ్ గారితో ఇలాంటి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పటినుంచో ఆయన నటన అంటే చాలా ఇష్టం. ఆయనని కలవాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఫస్ట్ నేరేషన్ అవ్వగానే విజయ్ గారు ఓకే చెప్పేసారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడం నా అదృష్టం, అది నా డెస్టినీ," అని అంటున్నారు వంశీ పైడిపల్లి.

admin1

admin1

Next Story