దయచేసి మమ్మల్ని క్షమించండి.. తిరుమల వివాదంపై విఘ్నేశ్‌ శివన్‌ లేఖ..

Nayanthara-Vignesh Shivan: పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 Jun 2022 10:42 AM IST
Vignesh Shivan Apology Letter to TTD
X

దయచేసి మమ్మల్ని క్షమించండి.. తిరుమల వివాదంపై విఘ్నేశ్‌ శివన్‌ లేఖ..

Nayanthara-Vignesh Shivan: పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు. పెళ్లి తరువాత తొలిసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించిన ఈ నవ దంపతులు.. ఆదిలోనే వివాదాలపాలయ్యారు. నయనతార చెప్పులు ధరించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో నడవడం రచ్చకు కారణమైంది. అయితే, ఈ వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని చెప్పుకొచ్చారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.

విఘ్నేశ్‌ ఇచ్చిన వివరణ ఏంటంటే.. 'అందరికీ నమస్కారం.. నిజానికి మేము తిరుమలలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చెన్నైలో చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వివాహం అయిన వెంటనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండానే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లాము. దర్శనం ముగిసిన వెంటనే ఆలయం ముందు ఫొటో తీసుకోవాలని భావించాము.

అయితే భక్తులు భారీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లి, మళ్లీ రద్దీ తగ్గగానే తిరిగి వచ్చాము. ఫొటోషూట్‌ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి'' అని విఘ్నేశ్‌ శివన్‌ రాసుకొచ్చారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story