Venkatesh: అప్పటిదాకా సినిమాలు ఒప్పుకోను అంటున్న వెంకటేష్

admin1
Updated on: 10 Sept 2021 1:02 PM IST
Victory Venkatesh said i Will not Accept any Movies Till the F3 and Drishyam 2 Movie Complete
X

వెంకటేష్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Venkatesh : సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేతిలో ప్రస్తుతం రీమేక్ సినిమాలు లేక సీక్వెల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మధ్యనే తమిళ్ లో సూపర్ హిట్ అయిన "అసురన్" చిత్రానికి రీమేక్ గా "నారాప్ప" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ ఇప్పుడు "ఎఫ్2" సినిమాకి సీక్వెల్ అయిన "ఎఫ్ 3" సినిమా తో బిజీగా ఉన్నారు. మరోవైపు దృశ్యం సినిమాకి రీమేక్ అయిన "దృశ్యం 2" చిత్రం తో కూడా బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సినిమా కూడా అలాగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు విడుదలయ్యే వరకు మరో సినిమా పై ఫోకస్ చేయకూడదని వెంకీ నిర్ణయించుకున్నారట.

అందుకే ఇకమీదట వస్తున్న కథలను కూడా వెంకీ సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారట. నిజానికి వెంకటేష్ తమిళంలో సూపర్ హిట్ అయిన "విక్రమ్ వేదా" సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అంకుకున్నరు కానీ తనకు రీమేక్లు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అని ఈ కథను పక్కకు పెట్టేశారు. ఇక వెంకటేష్ కోసం తరుణ్ భాస్కర్ ఒక కథ రెడీ చేస్తున్నారు కానీ ఆ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో కొన్నాళ్లు వేరే స్క్రిప్టులకు ఓకే చెప్పకూడదని నిర్ణయించుకున్నారు వెంకీ. మరి వెంకీ మరొక సినిమాని ఎప్పుడు లైన్ లో పెడతారు తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story