Tollywood: Drishyam 2 సీక్వెల్ లో వెంకటేష్

Tollywood: దర్శకుడు జీతూ జోసెఫ్‌ మోహన్‌ లాల్‌ హీరోగా మలయాలంలో తెరకెక్కించిన థ్రిల్లర్‌ చిత్రం 'దృశ్యం'.

Venkata Chari
Updated on: 20 Feb 2021 5:44 PM IST
Victory Venkatesh is Ready to Shoot for Drishyam 2
X

వెంకటేష్: ఫోటో హన్స్ ఇండియా


Tollywood: దర్శకుడు జీతూ జోసెఫ్‌ మోహన్‌ లాల్‌ హీరోగా మలయాలంలో తెరకెక్కించిన థ్రిల్లర్‌ చిత్రం 'దృశ్యం'. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్‌ హాసన్, హిందీలో అజయ్‌ దేవగణ్‌ రీమేక్‌ చేశారు. తాజాగా మోహన్‌ లాల్‌, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లోనే 'దృశ్యం 2' సీక్వెల్ తెరకెక్కింది. ఈ సినిమా శుక్ర వారం నేరుగా అమేజాన్‌ ప్రైమ్ లో విడుదలయింది. ఈ సీక్వెల్‌ కూడా తెలుగులో రీమేక్‌ కానుందని సమాచారం. మొదటి భాగంలో నటించిన వెంకటేశ్‌ 'దృశ్యం 2' సీక్వెల్‌లోనూ చేసేందుకు పచ్చజెండా ఊపారట. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారట.

అయితే కొన్ని రోజుల క్రితమే జీతూ జోసెఫ్ హైదరాబాద్ చేరుకుని, లోకేషన్స్ వెదిక పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. లోకేషన్లు ఫైనల్ చేశాక మార్చి మొదటి వారంలో 'దృశ్యం 2' షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story