Venkatesh: రీమేక్‌లతో ఫుల్‌ బిజీగా ఉన్న.... విక్టరి వెంకటెష్

Venkatesh: మలయాళంలో మెహన్‌లాల్‌ హీరోగా నటించిన "దృశ్యం" * తమిళ హిట్‌ " అసురన్‌" చిత్రానికి రీమేక్‌గా "నారప్ప" సినిమా

Sandeep Eggoju
Updated on: 24 Feb 2021 2:56 PM IST
Victory Venkatesh is Full Busy in Remake the two Movies in Telugu
X

హీరో వెంకటేష్ (ఫైల్ ఇమేజ్)

Venkatesh: టాలీవుడ్‌ అగ్రహీరోలంతా ఇప్పుడు రీమేక్‌ సినిమాలు చేస్తున్నారు. స్ట్రైట్‌ సినిమాల కంటే పరభాష సినిమాలపైనే ఎక్కవగా ఫోకస్‌ పెట్టారు. ఉన్నవారిలో ఒకరు, ఇద్దరు హీరోలు ఒకటి.. అర సినిమాలు రీమేక్‌ చేస్తుంటే ఓ టాఫ్‌ హీరో మాత్రం ఏకంగా రెండు రీమేక్‌లపతో ఫుల్‌ బిజీ అయ్యాడు. ఇంతకీ ఆహీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

టాలీవుడ్‌ అగ్రహీరోలంతా రీమేక్‌లపై ఫోకస్‌ పెట్టారు. పరభాషల్లో ఏ సినిమా హిట్టైనా.. ఆసినిమాలను రీమేక్‌ చేయడానికి పోటీపడుతున్నారు. అవరసరమైతే రీమేక్‌ హక్కులు సొంతం చేసుకోవడానికి భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫర్‌ సినిమాను రీమేక్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే... విక్టరీ వెంకటేష్‌ మాత్రం రెండు రీమేక్‌లతో ఫుల్‌ బిజీ అయ్యారు. చెప్పాలంటే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో వెంకటేష్‌కు.. రీమేక్‌లు చేయడం కొత్తేమి కాదు.

మలయాళంలో మెహన్‌లాల్‌ హీరోగా నటించిన "దృశ్యం" సినిమాను హీరో వెంకటేష్‌ అదే టైటిల్‌తో రీమేక్‌ చేసి భారీ సక్సెస్‌ అందుకున్నారు. ఇటీవల మలయాళంలో దృశ్యంకి సీక్వెల్‌గా రూపొందించిన "దృశ్యం-2" ఘన విజయం సాధించడంతో.. విక్టరీ వెంకటేష్‌ తెలుగులో కూడా సీక్వెల్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తమిళ హిట్‌ " అసురన్‌" చిత్రానికి రీమేక్‌గా "నారప్ప" సినిమా రూపొందుతుంది. వెంకటేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు ఎండ్‌కు వచ్చేసింది.

" నారప్ప" సినిమాలో వెంకీ ఇందులో పేద రైతుగా, ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నారు. అయితే వెంకటేష్‌ నిర్మాతలను, ప్రస్తుతం తనకున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రీమేక్‌ చేస్తాడని సమాచారం. ఏదీ ఏమైనా విక్టరీ వెంకటేష్‌ రీమేక్‌ చేస్తున్న ఈ సినిమాలు సక్సెస్‌ అయి.. ఆయన పేరు జస్టిఫికేషన్‌ ఉండాలని ఆశిద్ధాం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story