Drishyam2: వెంకీమామా జెట్‌స్పీడ్.. దృశ్యం-2 షూటింగ్ పూర్తి చేసేసిండు!

Drishyam2: మలయాళం సూపర్‌స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృశ్యం-2’ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 15 April 2021 6:39 PM IST
Victory Venkatesh Finishes His Part Of Shooting In Drishyam-2 Movie
X

వెంకటేష్ (ఫొటో ట్విట్టర్)

Drishyam2: మలయాళం సూపర్‌స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. సీక్వెల్ కూడా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో తెలుగులోనూ షూటింగ్ ప్రారంభించారు. దృశ్యం మొదటి భాగంలో నటించిన స్టార్ క్యాస్ట్‌నే ఈ సినిమాలోనూ తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమాలో వెంకటేష్ తన భాగం షూటింగ్‌ని పూర్తి చేశారంట. ఈ విషయాన్ని దర్శకుడు జీతు జోసెఫ్ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశాడు. 'ఈరోజు డీ2 సినిమా షూటింగ్‌లో వెంకటేశ్‌గారి చివరి వర్కింగ్ డే. మీ సహకారానికి, మద్దతుకి ధన్యవాదాలు సార్' అంటూ అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

2014లో విడుదలైన దృశ్యం సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా మీనా నటిస్తుండగా.. ఆయన కూతుళ్లుగా కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ నటిస్తున్నారు. దాదాపు ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం వెంకటేశ్ తమిళంలో సూపర్ హిట్ సాధించిన 'అసురన్' రీమేక్‌గా తెరకెక్కుతున్న 'నారప్ప' సినిమాతో పాటు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్‌-2' సీక్వెల్‌గా రూపొందుతున్న 'ఎఫ్-3' సినిమాలో నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story