సినీ నటుడు శరత్‌బాబుకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలింపు..

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

Arun Chilukuri
Published on: 22 April 2023 4:19 PM IST
Veteran Actor Sarath Babu Hospitalised
X

సినీ నటుడు శరత్‌బాబుకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలింపు..

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా బెంగళూరులో చికిత్స పొందుతున్న ఆయనను.. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం శరత్‌కుమార్‌కు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఐసీయూ నుంచి సాధారణ గదికి షిప్ట్‌ చేశారు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. ఇప్పటి వరకు 250కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా మూడు నంది పురస్కారాలు కూడా దక్కాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story