పాపం ఆ కోరిక తీరకుండానే.. వేణుమాధవ్ కన్నుముశారు...

పాపం ఆ కోరిక తీరకుండానే.. వేణుమాధవ్ కన్నుముశారు...
x
Highlights

గతకొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హాస్యనటుడు వేణుమాధవ్ ఈ రోజు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగుచిత్ర...

గతకొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హాస్యనటుడు వేణుమాధవ్ ఈ రోజు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగుచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయంతో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు వేణుమాధవ్.. అ తర్వాత తొలిప్రేమ,దిల్,సై,లక్ష్మి లాంటి సినిమాలు వేణుమాధవ్ ని స్టార్ కమెడియన్ ని చేసాయి. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా పనిచేసారు.

అయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు ఎన్టీఆర్ కి పరిచయం చేసారు. అ తర్వాత ఎన్టీఆర్ మాట మేరకు అయన కొన్నిరోజులు టీడీపీ ఆఫీస్ లో పనిచేసారు. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ తరుపున పనిచేసారు వేణుమాధవ్ ... వేణుమాధవ్ కి ఎమ్మెల్యే కావాలని ఎప్పటినుండో కోరిక ఉండేది. ఈ విషయాన్ని అయన పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కోదాడ నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి వెనుకకి తగ్గారు.

దీనితో అ కోరిక అలాగే ఉండిపోయింది. వేణుమాధవ్ కి భార్య శ్రీవాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొత్తం వేణుమాధవ్ 600 సినిమాల్లో నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories