నయనతార కి పెళ్లి అచ్చి రాదు అంటున్నా జ్యోతిష్కుడు

*నయనతార వివాహం పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి

Rama Rao
Published on: 12 May 2022 1:36 PM IST
Venu Swamy Made Shocking Comments on Nayantaras Marriage
X

నయనతార కి పెళ్లి అచ్చి రాదు అంటున్నా జ్యోతిష్కుడు

Nayantara's Wedding: ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి చాలా మందికి పరిచయం అక్కర్లేదు. సినీ సెలబ్రిటీల గురించి ఆయన ఇప్పటికే చాలా ఆసక్తికరమైన జోస్యాలు చెప్పారు. గతంలో సమంత మరియు నాగచైతన్య పెళ్లి సమయంలోనే వారి వివాహం కలిసి రాదని వారు త్వరలోనే విడిపోతారు అని జోస్యం చెప్పారు వేణు స్వామి. ఇక గతేడాది నాగచైతన్య మరియు సమంత వేణు స్వామి చెప్పిన విధంగానే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వేణుస్వామి లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

ఐదేళ్లు ప్రేమించి నయనతార ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ తో లాక్ డౌన్ లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈ ఏడాది జూన్ 9న వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల వైవాహిక జీవితంపై స్వామి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

నయనతార కి పెళ్లి అచ్చి రాదని వివాహం తర్వాత ఆమె జీవితం లో కలతలు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవి విడాకుల దాకా దారితీసే అవకాశం కూడా ఉందని అన్నారు వేణు స్వామి. మరి నయనతార విషయంలో కూడా వేణు స్వామి జ్యోతిష్యం నిజం అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. అలాగే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన తన సినీ కెరియర్ కూడా అంతమై పోతుందని ఆయన అనడం అభిమానులను షాక్ కు గురి చేసింది.

Rama Rao

Rama Rao

Next Story