Celebrity Astrologer: వరుణ్, లావణ్య విషయంలో వేణు స్వామి జోస్యం నిజమైందా..??

ఈ ఏడాది అంటే 2023కు సంబంధించి వేణు స్వామి చెప్పిన పలు విషయాలు నిజం అయ్యాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు..ఏయే విషయాలు నిజం అయ్యాయంటే..

Dhatripriya
Updated on: 2 Jun 2023 2:31 PM IST
Venu Swamy: Did Venu Swami Prophecy about Varun and Lavanya Come True?
X

Celebrity Astrologer: వరుణ్, లావణ్య విషయంలో వేణు స్వామి జోస్యం నిజమైందా..??

Astrologer Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీనటుల జాతకాలు పబ్లిక్ గా చెబుతూ ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకునే సమయంలో వారిద్దరు విడిపోతారని జోస్యం చెప్పారు. అక్కినేని అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని..ఈ దోషం ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది కాదని చెప్పారు. దర్శకులు, కథలు ఎంపికలో ఎవరి సలహాలు తీసుకోకుండా ముందుకు సాగాలని అక్కినేని అఖిల్ కు వేణుస్వామి ఉచితంగా సలహా ఇచ్చారు. అంతెందుకు, రష్మిక మందన ఈ గురువుగారికి వీర భక్తురాలు. ఈయన ఆధ్వర్యంలోనే కెరీర్ బాగుండాలని ప్రత్యేక పూజలు చేయించుకుంది. రష్మిక మాత్రమే కాదు నిధి అగర్వాల్ కూడా ఈ మధ్య రాజశ్యామల యాగం చేయించుకుంది.

రాంచరణ్_ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని వేణుస్వామి గతంలోనే చెప్పారు. అదే నిజం అయింది. ఇక ఈ ఏడాది అంటే 2023కు సంబంధించి వేణు స్వామి చెప్పిన పలు విషయాలు నిజం అయ్యాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. 2023లో ఒక హీరో చనిపోతాడని వేణుస్వామి చెప్పారు. ఆ హీరో ఎవరు అనేది చెప్పలేదు. కానీ తారకరత్న రూపంలో నిజమైంది అని నెట్టింట పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓ టాలీవుడ్ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని కూడా వేణు స్వామి చెప్పారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ వార్తలతో ఆ భవిష్య వాణి కూడా ఫలించినట్లైంది.

ఇక టాలీవుడ్ హీరో ప్రభాస్ కు 2023 కలిసిరాదని వేణు స్వామి చెప్పారు. మరికొన్ని రోజుల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. ఈ సినిమా ఇచ్చే ఫలితంతో వేణు స్వామి చెప్పే మాటల్లో ఎంత నిజముందని తేలిపోతుంది.

Dhatripriya

Dhatripriya

Next Story