Raviteja - Venky Kudumula: రవితేజకు కథ నెరేట్ చేసిన "ఛలో" దర్శకుడు

admin1
Updated on: 5 Aug 2021 5:07 PM IST
Venky Kudumula Narrate The Story to Raviteja
X

వెంకీ కుడుముల - రవితేజ (ఫైల్ ఫోటో)

Raviteja - Venky Kudumula: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. 2021లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలలో 'క్రాక్' కూడా ఒకటి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో "ఖిలాడి" అనే సినిమా తో బిజీగా ఉన్నారు. మరోవైపు తన తదుపరి ప్రాజెక్టు అయిన "రామారావు ఆన్ డ్యూటీ" కూడా ఇప్పటికే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు పలు దర్శకుల ను కలుస్తున్న రవితేజ కొన్ని కథలను కూడా వింటున్నాడు. ఈమధ్యనే రవితేజకు ఒక యువ దర్శకుడు కథను నెరేట్ చేసినట్లు సమాచారం.

ఆ దర్శకుడు ఎవరో కాదు వెంకీ కుడుముల. నాగ శౌర్య హీరోగా నటించిన "ఛలో" సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల ఈ మధ్యనే నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "భీష్మ" సినిమాతో బాగానే మెప్పించాడు. తాజాగా వెంకీ కుడుముల రవితేజకు ఒక కథను చేశాడట. రవితేజకు కథ బాగానే నచ్చింది కానీ ఇంకా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వెంకీ కుడుముల రవితేజ కాంబినేషన్లో ఇది మొదటి సినిమా కాబోతోంది.

admin1

admin1

Next Story