Chiranjeevi: యువ డైరక్టర్ కి షాక్ ఇచ్చిన మెగాస్టార్..?

Venky Failed To Satisfy Chiru?
x

Chiranjeevi: యువ డైరక్టర్ కి షాక్ ఇచ్చిన మెగాస్టార్..?

Highlights

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్ లని అంగీకరించిన చిరు ఓకే సారి మూడు సినిమాలని సెట్స్ పైకి కూడా తీసుకెళ్లారు. అందులో మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా తెరకెక్కనున్న "గాడ్ ఫాదర్" కూడా ఒకటి. మూవీని అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరోవైపు బాబి డైరెక్షన్ లో చేస్తున్న "వాల్తేరు వీరయ్య" కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

ఇది కూడా పక్కన పెట్టేయగా ఈ మూడు సినిమాలతో పాటు మెగాస్టార్ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. నిజానికి మారుతితో ఒక ప్రాజెక్ట్, వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ కూడా చిరు ఓకే చేసారని తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాతగా కూడా ఇంకొక ప్రాజెక్ట్ ని ఓకే చేశారు చిరు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు మొదలయ్యాయి.

తాజాగా దీని గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తెలుస్తోంది. ముందు నేరేట్ చేసిన కథ చిరుకు నచ్చకపోవడంతో కొత్త కథతో రమ్మన్నారట. ఆ తరువాత కొత్త కథతో వెళ్ళిన డైరెక్టర్ స్క్రిప్ట్ నెరేషన్ పూర్తి చేశారు. అయితే సెకండ్ పార్ట్ లో చిరు భారీ మార్పులు చెప్పారని సమాచారం. రీసెంట్ గా సెకండ్ హాఫ్ ఫైనల్ డ్రాఫ్ట్ ని చిరుకి వినిపించారు వెంకీ కుడుముల. చిరు ఓకే అంటే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయం అని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories