15 రోజులు నారప్ప నాన్ స్టాప్ షూటింగ్ !

15 రోజులు నారప్ప నాన్ స్టాప్ షూటింగ్ !
x
Highlights

గత ఏడాది తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి వెంకీమామగా అలరించాడు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.

గత ఏడాది తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి వెంకీమామగా అలరించాడు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ్ లో ధనుష్ , మంజు వారియర్ కలిసి నటించిన అసురన్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా తమిళ్ లో మంచి హిట్ అవడం, సీనియర్ హీరో వెంకటేష్ దీనిని రీమేక్ చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రతీకార కథాంశంతో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాతలు అయిన సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిమిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా వికారాబాద్ అడవుల్లో మొదలు పెట్టింది. 15 రోజుల పాటుగా ఈ షెడ్యుల్ ఏకధాటిగా కొనసాగనుంది. ఈ షెడ్యుల్ లో వెంకటేష్ తో పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ ని కూడా ఇక్కడే తెరక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ చేయనున్నారు. ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఎఫ్2 సినిమాని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories