Venkatesh: "మజిలీ" డైరెక్టర్ తో సినిమా సైన్ చేసిన వెంకటేష్

Venkatesh Movie With Director Shiva Nirvana | Tollywood News
x

నాని డైరెక్టర్ తో వెంకీ సినిమా...

Highlights

Venkatesh: నాని డైరెక్టర్ తో వెంకీ సినిమా

Venkatesh Movie: ఈ మధ్యనే "నారప్ప" మరియు "దృశ్యం 2" సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్నారు. "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఇప్పుడు మరో సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "నిన్ను కోరి" సినిమాతో డైరెక్టర్ గా మారిన "శివ నిర్వాణ" మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు.

ఆ తర్వాత "మజిలీ" అనే సినిమాతో కూడా బాగా మెప్పించిన శివ నిర్వాణ ఈ మధ్యనే విడుదలైన "టక్ జగదీష్" సినిమాతో మాత్రం కెరీర్ లోని మొదటి ఫ్లాప్ ను చవి చూశారు. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ వెంకటేష్ కి ఒక కథని వినిపించారట. వెంకీ కు కూడా కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇప్పటిదాక శివ నిర్వాణ తీసిన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామా ఇక ఈ సినిమా కూడా అలానే ఉండబోతోందని అనుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories