జాతిరత్నాలు డైరెక్టర్ తో చేతులు కలపనున్న వెంకటేష్

Venkatesh: నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన "జాతిరత్నాలు" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Updated on: 19 March 2022 6:01 PM IST
Venkatesh Joins Hands With Jatiratnalu  Director
X

జాతిరత్నాలు డైరెక్టర్ తో చేతులు కలపనున్న వెంకటేష్ 

Venkatesh: నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన "జాతిరత్నాలు" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టార్డం లేని హీరోలతో ఒక కామెడీ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు అని నిరూపించిన డైరెక్టర్ అనుదీప్ కె.వి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అనుదీప్ కె.వి తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనుదీప్ ఇప్పుడు ఒక సీనియర్ హీరో తో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సీనియర్ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. దృశ్యం 2, ఎఫ్ 2 వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ లు అందుకున్న వెంకటేష్ తాజాగా ఇప్పుడు ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఒక వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న వెంకటేష్ అనుదీప్ కె.వి డైరెక్షన్ లో ఒక ఫామిలీ సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను సీతార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరోవైపు శివ కార్తికేయన్ హీరోగా ఒక తమిళ్, తెలుగు సినిమాతో బిజీగా ఉన్నారు అనుదీప్.

admin1

admin1

Next Story