Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..

విశ్వక్ సేన్ కోసం దేవుడిగా మారనున్న వెంకటేష్

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 6:43 PM IST
Venkatesh in Vishwak Sen Ori Devuda Movie
X

Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..

Vishwak Sen: ఈ మధ్యనే "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు "ఓరి దేవుడో" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ మరియు రితిక సింగ్ లు హీరో హీరోయిన్లుగా నటించిన "ఓ మై కడుగులే" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

రొమాంటిక్ ఫాంటసీ డ్రామాగా ఇప్పుడు "ఓరి దేవుడో" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తమిళ్ వర్షన్ లో ప్రముఖ హీరో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో కనిపించారు. తాజాగా తెలుగు వర్షన్ లో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం వెంకటేష్ మూడు రోజులపాటు షూటింగ్ చేయబోతున్నారట.

త్వరలోనే వెంకటేష్ సన్నివేశాలకి సంబంధించిన షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. "కార్వాన్" ఫేమ్ మిథిలా పాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమాకి అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు పివిపి బ్యానర్ తో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story