Venkatesh: వెంకటేష్ పాత్రలపై పెదవి విరుస్తున్న అభిమానులు

Venkatesh Fans Are Angry About Movies
x

Venkatesh: వెంకటేష్ పాత్రలపై పెదవి విరుస్తున్న అభిమానులు

Highlights

Venkatesh: వెంకటేష్ సినిమాలపై మండిపడుతున్న అభిమానులు

Venkatesh: ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. మిగతా హీరోల కంటే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరుంది. కానీ గత కొంతకాలంగా వెంకటేష్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. వెంకటేష్ సినిమాల ఛాయిస్ విషయంలో కూడా అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. వెంకటేష్ ని మళ్లీ మంచి సినిమాలతో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకటేష్ ఇలాంటి స్క్రిప్ట్ సెలక్షన్ లో ఇలాంటి తప్పులు చేయటం నిజంగా బాధాకరమని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే "రానా నాయుడు" సిరీస్ లో వెంకటేష్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటిదాకా ఫ్యామిలీ హీరో వంటి ఇమేజ్ ఉన్న వెంకటేష్ ని అలాంటి పాత్రలో అభిమానులు అసలు చూడలేకపోయారు. తాజాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ ని కూడా ప్రకటించారు. మరొకసారి వెంకటేష్ ని అలాంటి పాత్రలో చూడడానికి ప్రేక్షకులు ఏమాత్రం సిద్ధంగా లేరు.

ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ వద్దు అని సైతం కామెంట్లు చేస్తున్నారు కొందరు. మరోవైపు వెంకటేష్ ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" సినిమాలో కనిపించారు. కానీ వెంకీ పాత్రకి సినిమాలో అంత ప్రాధాన్యత ఏమీ ఉండదు. అసలు వెంకటేష్ ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకుంటున్నారని, ముఖ్యంగా ఆఖరి స్టేజెస్ లో వెంకటేష్ ఇలాంటి చిన్న చిన్న పాత్రలలో నటించాల్సిన కర్మ ఏంటని వెంకీ అభిమానులు తలలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో "సైంధవ్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో అయినా వెంకీ హిట్ అందుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories