నాగచైతన్య బిజినెస్ గురించి వెంకటేష్ కూతురు కామెంట్

నాగచైతన్య బిజినెస్ గురించి వెంకటేష్ కూతురు కామెంట్

admin1
Published on: 6 March 2022 3:48 PM IST
Venkatesh Daughter Comments on Naga Chaitanya Food Business
X

నాగచైతన్య బిజినెస్ గురించి వెంకటేష్ కూతురు కామెంట్

Naga Chaitanya Food Business: ఈ మధ్యనే బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరోవైపు వెబ్ సిరీస్ తో కూడా నాగచైతన్య ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే సమంత తో విడాకులు తీసుకున్న నాగచైతన్య ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఈ విషయాన్ని స్వయంగా ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

"మంచి ఫుడ్ కోసం నేను ఎప్పుడూ వెతుకుతూ ఉంటాను. ప్రపంచవ్యాప్తంగా తిరిగి వివిధ వంటకాలను ట్రై చేశాను. ఆసియన్ ఫుడ్ ఎప్పుడూ నా హార్ట్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు రీ క్రియేట్ చేస్తున్నాను. ప్రెసెంటింగ్ "షోయు". కొన్ని అద్భుతమైన ప్యాన్ ఆసియన్ డిషెస్ ను మీకు అందజేస్తుంది. ఇంతమంచి టీమ్ దొరకడం నా అదృష్టం. షోయు నుంచి ఇప్పుడే ఆర్డర్ చేయండి" అని ఒక వీడియో ని షేర్ చేశారు నాగ చైతన్య. "ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావ" అంటూ వెంకటేష్ కూతురు ఆశ్రిత కామెంట్ చేసింది.





admin1

admin1

Next Story