Narappa Movie: 'నారప్ప'వాయిదా.. ఓటీటీలో విడుద‌లపై క్లారీటి

Narappa Movie: విక్టరీ వెంక‌టేష్‌- ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన నార‌ప్ప చిత్రం రిలీజ్ తాత్కాలికంగా వాయిదా ప‌డింది.

Samba Siva Rao
Updated on: 29 April 2021 4:10 PM IST
Venkatesh Daggubati Movie Narappa Postponed Due to Corona Cases in India
X

నారప్ప పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Narappa Movie: క‌రోనా వైరస్ సెకండ్ వేవ్ కరాళనృత్యం చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేళైంది. ఈ ఏడాది మొదట్లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని అంతా భావించారు. అయితే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించుకున్నాయి. మరోసారి కరోనా రక్కసి మీదపడడంతో సినీ ఇండస్ట్రీ మళ్లీ కల తప్పింది. ఒక వైపు థీయేటర్లు మూతపడ్డాయి. గతంలో విడుదల తేదీలు ప్రకటించిన చిన్న పెద్ద చిత్రాలన్ని విడుదల వేసుకుంటూ వచ్చాయి.

ఇప్ప‌టికే ల‌వ్ స్టోరీ, విరాట ప‌ర్వం, ఆచార్య‌తో పాటు ప‌లు తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వాయిదా ప‌డ‌గా ఇప్పుడు విక్టరీ వెంక‌టేష్‌- ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన నార‌ప్ప చిత్రం రిలీజ్ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. మే 14న నార‌ప్ప చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉంది. సినిమా వాయిదా పడింది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

కాని క‌రోనా వ‌ల‌న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డిచింది. అయితే అవ‌న్నీ పుకార్లు అని కొట్టి పారేసిన చిత్ర బృందం 'నారప్ప' సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు అధికారకంగా వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ అధికారకంగా థియేటర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిననున్నట్టు తెలిపారు. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. త‌మిళ చిత్రం అసుర‌న్‌కి రీమేక్‌గా నార‌ప్ప తెరకెక్కుతోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story