F3 Movie: ఆ విషయంలో ఇద్దరు హీరోలని ఇబ్బంది పెట్టనున్న సునీల్..!!

Sandeep Reddy
Updated on: 13 July 2021 8:00 PM IST
Venkatesh and Varun Tej Troubles To Pay Back Sunil Money in F3 Movie
X

సునీల్ (ఫైల్ ఫోటో)

F3 Movie: వరుస హిట్లతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి... 2019లో వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ హీరోలుగా కామెడీ జోనర్ లో తెరకేక్కిన ఎఫ్2 సినిమా మంచి హిట్ సాధించింది. ఆ సినిమా విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకేవ్వరు" కూడా హిట్ కొట్టడంతో ఒక్కసారిగా అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఎఫ్2 కి సీక్వెల్ గా దిల్ రాజు నిర్మాతగా ఎఫ్3 సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు. కరోనా కారణంగా గత కొద్ది రోజులు షూటింగ్ కి కొంత అంతరాయం కలిగిన ఇటీవలే కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో తిరిగి చిత్ర యూనిట్ షూటింగ్ లో పాల్గొంది.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు పిసినారిగా ఉండే వడ్డీ వ్యాపారి పాత్రలో ఉన్న సునీల్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని అవి తీర్చడానికి ఆ ఇద్దరు హీరోలు పడే ఇబ్బందులను ఫుల్ లెంగ్త్ కామెడీగా తెరకెక్కించి ప్రేక్షకులను నవ్వించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ల సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story