F3 Movie: డిఫెక్ట్ ఉన్న పాత్రల్లో "ఎఫ్ 3" హీరోలు

F3 Movie: వెంకటేష్ కి రేచీకటి వరుణ్ కి నత్తి

admin1
Updated on: 12 Aug 2021 11:19 AM IST
Venkatesh And varun Teej Plays Defective  Roles in F3 Movie
X
డిఫెక్ట్ ఉన్న పాత్రల్లో F3 హీరోలు (ఫైల్ ఇమేజ్)

F3 Movie: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన "ఎఫ్ 2" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. "ఎఫ్2" సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహారీన్ ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలోని పాత్రలు అలానే ఉంటాయి కానీ కథ మాత్రం వేరేగా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ పాత్రల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాలో వెంకటేష్ పాత్రకు రేచీకటి ఉంటుందట. మరోవైపు వరుణ్ తేజ్ పాత్రకు నత్తి అని, ఇక వీరిద్దరూ వారి లోపాలతో ప్రేక్షకుల లో నవ్వులు పువ్వులు పూయిస్తారని సమాచారం. ఇప్పటికే మారుతీ వంటి దర్శకులు హీరో కి ఏదో ఒక డిఫెక్ట్ పెట్టి దానిపై కామెడీ సృష్టించడం చూశాము. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story