Venkatesh-Rana: మలయాళం సినిమా రీమేక్ కోసం వెంకీ, రానా

Venkatesh-Rana: వెంకీ మరియు రానా లతో "బ్రో డాడీ"

Rama Rao
Published on: 1 Feb 2022 2:00 PM IST
Venkatesh and Rana for the Remake of Bro Daddy Malayalam Movie |  Telugu Movie News
X

మలయాళం సినిమా రీమేక్ కోసం వెంకీ, రానా

Venkatesh-Rana: మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్లాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించిన "బ్రో డాడీ" అనే సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా మారింది. పెళ్లికి ముందే గర్భవతి అయిన ఒక అమ్మాయి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే సినిమా లోని పాత్రలు మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తాజాగా ఈ చిత్ర తెలుగు రైట్స్ని సొంతం చేసుకున్నారు సురేష్ బాబు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే "బ్రో డాడి" తెలుగు రీమేక్ కోసం వెంకటేష్ మరియు రానా లను హీరోలుగా అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ సురేష్ బాబు కి చాలా బాగా నచ్చిందట. అందులో వెంకటేష్ మరియు రానా నటిస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రానా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అని వేచి చూడాలి. ఈ మధ్యకాలంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" కూడా మలయాళం సినిమా రీమేక్లే.

Rama Rao

Rama Rao

Next Story